‘ఎన్నికల ముందు 'SIR' హడావుడి ఎందుకు?’

‘ఎన్నికల ముందు 'SIR' హడావుడి ఎందుకు?’

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక డిమాండ్‌ చేశారు. ఓటర్ల జాబితా 'ప్రత్యేక సమగ్ర సవరణ'(SIR) ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ ప్రక్రియను ఎందుకింత హడావుడిగా నిర్వహిస్తున్నారో తమకు అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.