బ్రెయిన్ స్ట్రోక్‌తో వ్యక్తి మృతి
SRCL: ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గణగొని శ్రీనివాస్ గౌడ్ (44) అనే వ్యక్తి తల తిరుగుతుందని హైదరాబాద్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లాడు. వైద్యులు పరీక్షలు చేస్తుండగా.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కోమాలోకి వెళ్లిన శ్రీనివాస్ మంగళవారం రాత్రి మృతి చెందాడు.