రెక్కల రామక్క దేవాలయాన్ని దర్శించిన ఎమ్మెల్యే
BDK: ఆళ్లపల్లి మండలంలోని మర్కోడులో రెక్కల రామక్క దేవాలయాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కుటుంబ సమేతంగా ఇవాళ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే కోరం తెలిపారు.