నగరంలో ఈదురుగాలుల బీభత్సం

నగరంలో ఈదురుగాలుల బీభత్సం

HYD: నగరంలో ఆదివారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షం ఉత్తర హైదరాబాద్‌ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. 53 చోట్ల చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్తు లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. HYD, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హఫీజ్‌పేట్, చందానగర్, జూబ్లీహిల్స్, బేగంపేట, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయని విపత్తుల నిర్వహణ సంస్థకు ఫిర్యాదులు వచ్చాయి.