VIDEO: మహిళా సమైక్య భవనం అసంపూర్తి.. స్థానికులు ఆగ్రహం

WGL: వర్ధన్నపేట మండలం బండౌతపురంలో 2021లో మహిళా సమైక్య భవనానికి గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఎన్డీఎఫ్ నిధులతో రూ.10 లక్షలతో పనులు ప్రారంభమైనప్పటికీ, అసంపూర్తిగా ఉండి మొండి గోడలతో భవనం దర్శనమిస్తోంది. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నాలుగేళ్లుగా నిర్మాణం పూర్తి కావడం లేదని, అధికారలు స్పందించి నిర్మాణాలను ప్రారంభించాలని స్థానికులు ఆరోపిస్తున్నారు.