కాలువలోకి దూసుకెళ్లన బైక్.. వ్యక్తి మృతి

కాలువలోకి దూసుకెళ్లన బైక్.. వ్యక్తి మృతి

PLD: ఎడ్లపాడు మండలం జాలాదికి చెందిన దొరకరాజు (38) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆదివారం తెల్లవారుజామున చిలకలూరిపేట నుండి వేలూరు వెళ్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి పంట కాలువలో పడింది. దీంతో తలకు బలమైన గాయం కావడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.