విలువైన ప్రాణాలను కాపాడేందుకు కృషి: డీఐజీ
MDK: రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలను కాపాడేందుకు 'Arrive Alive' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఐజీ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ తూప్రాన్‌లో విద్యార్థులతో మానవహారం నిర్మించినట్లు వివరించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.