పండుగలా మేగా PTM నిర్వహిస్తాం: కలెక్టర్
VZM: ఈనెల 5న జరుగనున్న పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశాన్ని (మెగా PTM) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.