మైదుకూరులో టాయిలెట్ల నిర్మాణానికి ఆదేశాలు
KDP: మైదుకూరులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రజా దర్బార్‌లో మహిళా సమాఖ్య సిబ్బంది తమ సమస్యలను వినిపించారు. కార్యాలయంలో మరుగుదొడ్డి, రహదారి సౌకర్యాల లేమితో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే 15 రోజుల్లో నాణ్యమైన టాయిలెట్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే స్పందనపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు.