నిరుపేద కుటుంబానికి అండగా ఎన్నారై

నిరుపేద కుటుంబానికి అండగా ఎన్నారై

BHNG: చౌటుప్పల్ మండలం దామెరలో నిరుపేద కుటుంబానికి విశ్వనాథం (ఎన్నారై) అండగా నిలిచారు. కరోనా సమయంలో ధనలక్ష్మి భర్త ఉడుగు కృష్ణ చనిపోయాడు. దీంతో వారి కుటంబానికి పోషణ కరువై కూతురు చదువుకి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో విశ్వనాథం పంపించిన ₹20 వేల నగదును విశ్వనాథం ట్రస్ట్ సభ్యులు వారికి అందజేశారు. కార్యక్రమంలో దిలీప్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.