నగరంలో 24 గంటలపాటు తాగునీరు
HYD: నగరంలో ఇరవైనాలుగు గంటలపాటు తాగునీరు, వందశాతం మురుగు శుద్ధి లక్ష్యంగా ఐదేళ్ల బహుముఖ కార్యాచరణతో ' విజన్ డాక్యుమెంట్-2030' ను జలమండలి సిద్ధంచేస్తోంది. ఆధునిక సాంకేతికతతో స్మార్ట్ వాటర్ మేనేజ్‌మెంట్, నగరం పరిధి విస్తరణ లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక అంశాల ప్రాతిపదికగా దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందిస్తోంది.