'బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు'
ELR: జంగారెడ్డిగూడెం ASP సుస్మిత ఎక్సైజ్ పోలీసులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బెల్ట్ షాపులు, రోడ్ సైడ్ దాభాలో మద్యం అమ్మకాలు నిషేధమన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వ్యక్తులపై ఉక్కు పాదం మోపాలన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్, ఎస్సై అబ్దుల్ ఖలీల్ బ్రాందీ షాపుల లైసెన్స్ యజమానులు పాల్గొన్నారు.