అంకమ్మ తల్లి ఆలయానికి శంకుస్థాపన చేసిన మంత్రి

అంకమ్మ తల్లి ఆలయానికి శంకుస్థాపన చేసిన మంత్రి

ELR: ముసునూరు మండలం గోపవరంలోని బీసీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న అంకమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం శంకుస్థాపన చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంకమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడు ఉండాలని ఆకాంక్షించారు.