'రసాయన ఎరువులకు స్వస్తి పలికి, సేంద్రీయ సాగు చేపట్టాలి'
ASF: రైతులు రసాయన ఎరువులకు స్వస్తి పలికి, సేంద్రీయ పద్ధతిలో సాగు చేపట్టాలని కౌటాల AO ప్రేమలత సూచించారు. విచ్చలవిడిగా పురుగు మందుల వాడకం వల్ల భూసారం దెబ్బతిని పంట దిగుబడి తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సేంద్రీయ ఎరువులతో సాగు ఖర్చు తగ్గడమే కాకుండా, భూమిలోని సూక్ష్మజీవులు వృద్ధి చెంది ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.