VIDEO: హిందూ–ముస్లిం ఐక్యతకు నిదర్శనం
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలో రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ జన సమితి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎలిశాల రాజేష్ ఆధ్వర్యంలో నేడు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ-ముస్లిం ఐక్యత సమాజానికి ఆదర్శమని, రంజాన్ నెలలో భక్తిశ్రద్ధలతో ఉపవాసం చేయడం ఎంతో గొప్ప ఆచారమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.