47వ డివిజన్‌లో పర్యటించిన ఎమ్మెల్యే
KDP: 47వ డివిజన్‌లోని శాస్రినగర్‌లో సంబంధిత శాఖల అధికారులతో 'మన కడప -స్వచ్ఛ కడప' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాధవి నిర్వహించారు. ఈ సందర్భంగా శుభ్రత పరిస్థితులు, డ్రైనేజ్, చెత్త నిర్వహణ, పౌరసౌకర్యాలపై అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానికంగా పరిశుభ్రత పనులు మరింత సమర్థవంతంగా కొనసాగించాలని మున్సిపల్ సిబ్బందికి సూచనలు ఇచ్చారు.