మంచి మనసు చాటుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

మంచి మనసు చాటుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

సత్యసాయి: హిందూపురం కిరికెర వీవర్స్ కాలనీకి చెందిన మూడవ తరగతి విద్యార్థి చిద్విలాస్ కు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అండగా నిలిచారు. పుట్టుకతోనే చెవుడు లోపంతో బాధపడుతున్న ఆ బాలుడికి రూ. 50 వేల విలువైన వినికిడి పరికరాలను అందజేశారు. బాలకృష్ణ సౌజన్యంతో ఈ సాయం అందడం పట్ల విద్యార్థి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.