ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

అన్నమయ్య: నందలూరు మండలంలోని ఆడపూరు పంచాయతీ మర్రిపల్లె పొలాల్లో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్ఐ మోహన్ తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. రాబడిన సమాచారం మేరకు పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 6 మొబైల్, 2 స్కూటీలు, రూ.15300 నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు.