గన్నవరం బ్రిడ్జిని ప్రారంభించనున్న మంత్రి

గన్నవరం బ్రిడ్జిని ప్రారంభించనున్న మంత్రి

ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని గన్నవరంలో రూ.కోటి 85 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని ఈనెల 12న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నారు. సోమవారం మండల టీడీపీ అధ్యక్షుడు కేలం ఇంద్ర భూపాల్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి, ఇతర నాయకులు పాల్గొంటారని తెలిపారు.