కొండగట్టు అంజన్న ఆలయ చరిత్ర ఏంటో తెలుసా..?
JGL: మల్యాలలో ఉన్న కొండగట్టు అంజన్న ఆలయం సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన అత్యంత ప్రాచుర్యం పొందిన స్వయంభూ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అంజనేయ స్వామివారు నరసింహ వక్త్రంతో, శంఖు చక్రాలు ధరించి, హనుమంతునిగా దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో 40 రోజుల పాటు భక్తులు నియమ నిష్ఠలతో పూజలు చేస్తే, పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందని, మానసిక రోగాలు నయమవుతాయని భక్తుల బలమైన నమ్మకం.