ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి హైకోర్టు నోటీసులు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి హైకోర్టు నోటీసులు

TG: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ)పై విధించిన జరిమానాను పెంచాలంటూ సీబీఐ చేసిన అప్పీల్‌పై TG హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో సీబీఐ కోర్టు ఓఎంసీకి రూ. లక్ష జరిమానా విధించింది. అయితే ఈ జరిమానా మొత్తం సరిపోదని, దానిని పెంచాలని సీబీఐ అధికారులు హైకోర్టును కోరారు. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది.