జాతీయ జెండాను ఆవిష్కరించిన సబ్ కలెక్టర్

TPT: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జాతీయ భావం అలవర్చుకొని దేశభక్తి కలిగి ఉండాలన్నారు.