'ఈ నెల 7న జరిగే రెడ్ వాలంటీర్స్ విజయవంతం చేయాలి'
NTR: వీరులపాడు మండలంలో నవంబర్ 7న విజయవాడలో జరగనున్న రెడ్ వాలంటీర్స్ కవాతును విజయవంతం చేయాలని కోరుతూ సీపీఎం నేతలు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా సెక్రటేరియట్ సభ్యులు కోట కళ్యాణ్ మాట్లాడుతూ.. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి మాకినేని బసవపున్నయ్య భవనం వరకు కవాతు నిర్వహిస్తామని, అనంతరం ఎంబీబీకేలో సభ జరుగుతుందని తెలిపారు.