సివిల్ సప్లై కార్పొరేషన్ కార్మికుల సమ్మె నోటీసు అందజేత

NZB: మే 20న నిర్వహించే సివిల్ సప్లై కార్పొరేషన్ కార్మికుల సమ్మెకు సంబంధించిన నోటీస్‌లను కలెక్టరేట్‌లోని సివిల్ సప్లై కార్యాలయంలో జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డికి AITUC ఆధ్వర్యంలో నేడు అందజేశారు. సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఓమయ్య మాట్లాడుతూ.. జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా సమ్మె చేస్తున్నట్లు చెప్పారు.