'గ్రామాలలో మరిన్ని మెరుగైన సేవలు అందించాలి'

ADB: గ్రామాలలో మరిన్ని మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా నార్నూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి మోతిరామ్ శుక్రవారం షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. నార్నూర్ గ్రామస్తులు ఆయనను అభినందించారు. కార్యక్రమంలో నేతలు ఉన్నారు.