'ఆలయ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు'
ప్రకాశం: పామూరు పట్టణంలో మదన వేణుగోపాలస్వామి-వల్లి భోగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన మాన్యం భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను బుధవారం ఆలయ ఈవో గిరిరాజు నరసింహబాబు పోలీసుల సమక్షంలో జేసీబీలతో తొలగించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ.. దేవాలయ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.