లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
SDPT: గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కుకునూర్ పల్లి మండల కేంద్రానికి సమీపంలోని ఆర్వోబీపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కోరుట్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టడంతో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి, ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని 108 సిబ్బంది గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.