'పట్టుదలతో శ్రమిస్తే విజయాలు సాధించగలరు'

VSP: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో క్రమశిక్షణ, పట్టుదలతో శ్రమిస్తే విజయాలు సాధించగలరని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం శ్రీ వివేకానంద జూనియర్ కాలేజీ (వేములవలస) ఫ్రెషర్స్ డేలో ఆయన మాట్లాడుతూ... విద్య మనిషిని పరిపూర్ణుణ్ని చేస్తుందని పేర్కొన్నారు. కాలేజీ యాజమాన్యం సేవలకు ప్రశంసలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.