మెదక్-సిద్దిపేట మార్గంలో రాకపోకలు పునరుద్ధరణ

మెదక్-సిద్దిపేట మార్గంలో రాకపోకలు పునరుద్ధరణ

SDPT: మెదక్-సిద్దిపేట రహదారిపై నందిగామ వద్ద వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో గత 20 రోజులుగా నిలిచిపోయిన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. కల్వర్టు దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గం సిద్ధం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.