VIDEO: రాజవొమ్మంగిలో రాజులబాబు పండుగ ప్రారంభం
ASR: ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి మండలంలో ఆదివారం రాజులబాబు పండుగ ఘనంగా ప్రారంభమైంది. ముర్లవాణిపాలెం, రాజవొమ్మంగి పొలాల్లో రైతులు పురాతన చెట్ల కింద స్వామిని ఏర్పాటు చేసి పూలు, పండ్లు, ప్రసాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ 15 రోజుల పాటు రైతులు ఈ పండుగను పొలాల్లోనే జరుపుకోనున్నారు.