పోలీసులపై మందుబాబుల దాడి

పోలీసులపై మందుబాబుల దాడి

NLG: చండూరు మండలంలో మందుబాబులు పోలీసులపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులను చండురు పోలీసులు మందలించడంతో మద్యం మత్తులో వారిపై దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధిత పోలీసుల పిర్యాదుతో మందుబాబులపై కేసు నమోదు చేశారు.