VIDEO: 'వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి'

NZB: నగరంలోని వేణుమాల్‌లో ఉన్న KFC సెంటర్‌లో కుళ్ళిపోయిన చికెన్ అమ్మకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్ననిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. గత కొన్నిరోజులుగా ఈ వ్యాపారం కొనసాగుతోందని, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నవ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.