VIDEO: మరో RTC బస్సుకు తప్పిన పెను ప్రమాదం

VIDEO: మరో RTC బస్సుకు తప్పిన పెను ప్రమాదం

MLG: జిల్లా శివారులోని ప్రేమనగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హన్మకొండ నుంచి ఏటూరునాగారం వెళ్తున్న RTC బస్సు ముందు వెళ్తున్న ఇసుక లారీని ఢీ కొట్టింది. లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.