VIDEO: అర్ధవీడులో స్వచ్ఛ రథం ప్రారంభం
ప్రకాశం: అర్ధవీడు ఎంపీడీవో కార్యాలయంలో స్వచ్ఛ రథాన్ని సోమవారం గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రథం కేవలం చెత్తను సేకరించే వాహనం మాత్రమే కాదని, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తెచ్చే ఒక వేదిక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.