అహోబిలం ఆలయ భద్రతపై సమీక్షా సమావేశం
NDL: అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ భద్రత ఏర్పాట్లపై ఆళ్లగడ్డ DSP ప్రమోద్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అహోబిలం అటవీ శాఖ మఠం ప్రతినిధులతో ఆయన చర్చించారు. ఆలయ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో CC కెమెరాలు, స్ట్రాంగ్ రూంలో అలారం ఏర్పాటు, భద్రతపై చర్చించారు. ఈ సమావేశంలో సీఐ మురళీధర్ రెడ్డి, రుద్రవరం రేంజర్ ముర్తుజావలి, మఠం ప్రతినిధి సుందరరాజన్ ఉన్నారు.