ఎలక్ట్రిక్ బస్సులు పెంచాలని సీఎం ఆదేశం
AP: రాష్ట్రంలోని రహదారులను గుంతలు లేకుండా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అధికారులతో జరిగిన సమీక్షలో రోడ్ల మరమ్మతులపై సీఎం దిశానిర్దేశం చేశారు. సామాన్యులపై ప్రయాణ భారం తగ్గించేందుకు మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని సూచించారు. మెరుగైన రవాణా సౌకర్యాల ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.