ఫ్రీ చికెన్ హలీమ్.. ఎగబడ్డ జనం

KNR: రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కరీంనగర్ జ్యోతిబా పూలే గ్రౌండ్‌లో ఈట్ మోర్ అనే సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉచిత చికెన్ హలీం మేళా నిర్వహించారు. చికెన్ హలీం కోసం జనం భారీగా ఎగబడ్డారు. బకెట్ల కొద్దీ హలీం తీసుకు వెళ్తుండడంతో తోపులాట చోటు చేసుకోవడంతో పోలీస్ బందోబస్తు మధ్య ఫ్రీ హలీం మేళ నిర్వహించారు.