జాతీయ ST కమిషన్ సభ్యుడిని సన్మానించిన BJP నేతలు
JN: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ BJP ఇంఛార్జ్ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు శుక్రవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్‌ను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో BJP జిల్లా కార్యదర్శి గట్టు కృష్ణ గౌడ్, ఎస్టీ మోర్చా రాష్ట్ర నాయకులు గుగులోత్ మధు నాయక్ ఉన్నారు.