ఇల్లు లేనివారికి శుభవార్త.. గడువు పొడిగింపు

ఇల్లు లేనివారికి శుభవార్త.. గడువు పొడిగింపు

AP: గ్రామాల్లో ఇల్లు లేని పేదలకు PM ఆవాస్ యోజన-గ్రామీణ్ కింద కేంద్రం నివాసం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. ఈ నెల 5నే గడువు ముగియగా.. కూటమి ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త లబ్ధిదారుల ఎంపికను ఆవాస్+ యాప్‌లో చేపడుతున్నందున అర్హులు సచివాలయాల్లో నమోదు చేసుకోవచ్చు.