అక్రమంగా ఇసుక రవాణా.. వ్యక్తిపై కేసు నమోదు

JN: ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను దేవరుప్పుల మండల పోలీసులు శనివారం పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని నీర్మాల గ్రామం నుంచి ఇసుకను తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. కొప్పుల భిక్షపతి అనే వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.శ్రావణ్ కుమార్ తెలిపారు.