విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!
NRPT: మక్తల్ మండలం రుద్ర సముద్రం పాఠశాలలో గురువారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు, అధికారుల పాత్రలు పోషించారు. ప్రిన్సిపాల్ హేమలత మాట్లాడుతూ.. ఈ దినోత్సవం విద్యార్థులకు ఉపాధ్యాయులు, అధికారుల కష్టనష్టాలు, నిర్వహణ విధానంపై అవగాహన కల్పిస్తుందని తెలిపారు.