టంగుటూరు విద్యార్థిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

టంగుటూరు విద్యార్థిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

ప్రకాశం: టంగుటూరు మండలలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి అన్నపురెడ్డి చందన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీడీ అరుణ తెలిపారు. ఈ మేరకు డిస్కస్ త్రో ఈవెంట్‌లో మొదటి స్థానాన్ని సాధించిందని, ఈ నెల 8, 9, 10వ తేదీల్లో శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందన్నారు. అనంతరం చందనను పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.