VIDEO: దివ్యాంగుల క్రీడా పోటీలు ప్రారంభించిన కలెక్టర్

VIDEO: దివ్యాంగుల క్రీడా పోటీలు ప్రారంభించిన కలెక్టర్

NRML: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను శనివారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు. దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరాన్ని కలెక్టర్ వివరించారు. దివ్యాంగుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.