శివాలయాల్లో భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

శివాలయాల్లో భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

MLG: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున భక్తులు గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి, అనంతరం ఆలయాలకు చేరుకుని 365 వత్తులతో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ సిబ్బంది ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.