'రాజధానిలో రైతులకు ప్లాట్లు ఎక్కడ'

GNTR: రాజధాని నిర్మాణానికి పొలాలు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఎక్కడ ఉన్నాయని మంగళగిరి వైకాపా ఇంఛార్జ్ వేమారెడ్డి ప్రశ్నించారు. కురగల్లులో శుక్రవారం రాత్రి 'బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజధానిలో భూమి లేక రైతులు కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజధానిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.