ఇన్‌స్పైర్ అవార్డు పొందిన రమణక్కపేట విద్యార్థిని

ఇన్‌స్పైర్ అవార్డు పొందిన రమణక్కపేట విద్యార్థిని

ELR: ముసునూరు మండలం రమణక్కపేట జడ్పీ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని వల్లూరి హాసిని ప్రియ ఇన్‌స్పైర్ అవార్డుకు ఎంపికైనట్లు హెచ్ఎం పీవీఎస్ రామకృష్ణ తెలిపారు. పాఠశాలలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. మెట్రో రైలులో అగ్ని ప్రమాదం నివారణ చర్యలు అనే అంశంపై అవార్డుకు ఎంపికైన హాసినికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్ రూ.10 వేలు బహుమతిగా అందిస్తారన్నారు.