VIDEO: ఖమ్మం-బోనకల్ మధ్య రాకపోకలు బంద్

KMM: చింతకాని మండలంలో కట్టలేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో రామకృష్ణాపురం వద్ద కందికుంట చెరువు అలుగు పడింది. చెరువు నీరు ఖమ్మం-బోనకల్ ప్రధాన రహదారిపై పందిళ్ళపల్లి వద్ద పొంగిపొర్లింది. రామకృష్ణాపురం దగ్గర వంతెన నీట మునిగింది. ఖమ్మం-బోనకల్ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు రహదారిపై బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.