తల్లాడ బస్టాండ్ ప్రాంగణంలో వీధి కుక్కల బెడద
KMM: తల్లాడ బస్టాండ్ ప్రాంగణంలో వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిందని ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రయాణికులపై దాడి చేసి గాయపరుస్తున్నాయని వాపోతున్నారు. రాత్రుళ్లు ఈ బెడద మరింత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. భద్రత దృష్ట్యా అధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కలను తొలగించాలని కోరారు.