'నీటి సంరక్షణలో మహిళల పాత్ర కీలకం'
NRML: మామడ మండలం బండల్ ఖానాపూర్‌లో మంగళవారం ప్రపంచ నీటి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూగర్భ జల శాఖ ఉపసంచాలకులు శ్రీనివాస్ బాబు పాల్గొని నీటి పొదుపు,ఇంకుడు గుంతల నిర్మాణంపై అవగాహన కల్పించారు. నీటి నిర్వహణలో మహిళల పాత్ర కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.