జనవాసాల మధ్య మద్యం షాపులను ఏర్పాటు చేయవద్దు: CPI
KMM: జననివాసాల మధ్య మద్యం షాపులను ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలను మానుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ రవిబాబు అన్నారు. కొత్తగా టెండర్లు దక్కించుకున్న వ్యాపారస్తులు ఊరి బయట ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జనవాసాల మధ్య మద్యం షాపులను ఏర్పాటు చేస్తే మహిళలు ఐక్యంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు.